పరవళ్ళు తొక్కే యువతరంగాలు
ఆకాశాన్ని తాకే ఆశాకెరటాలు
సంతోషంగా జీవించాలన్న ఉబలాటం
సరదాగా అంటు దురలవాట్లతో సావాసం
కొత్తవాటిపై కుర్రాళ్ళకి తగని మోజు
బీడీతో మొదలై బ్రాన్దితో ముగుస్తుందారోజు
సరదాలు పోయి వ్యసనంగా మారుతున్న అలవాట్లు
చెడుసాంగత్యానికి అవుతున్నారు బానిసలు
అన్నీ అనుభవించాలన్న వెర్రి ఆలోచనలు
సరదాగా అంటు శృంగారానికి ప్రాకులాటలు
తప్పును ఒప్పుగా చెయ్యగల మేదావులున్నారు
పొంచివున్న ముప్పు నుండి తప్పించుకుంటున్నారు
వ్యామోహంలో శృంగారానికి బానిసలవుతున్నారు
ఎయిడ్స్ మహమ్మారి శాపానికి గురవుతున్నారు
పొరుగు దేశాలలో ఉన్న మహమ్మారి మనదేశానికొచ్చింది
ఎయిడ్స్ బారినపడే వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది
Thursday, February 12, 2009
అమ్మ
పట్టుదలకు ప్రతిబింబము నీవు
నిరాడంబరతకు నిదర్శనము నీవు
త్యాగానికి మారుపేరు నీవు
మమతల మణిదీపము నీవు
ఉరికే జలపాతము నీవు
అలుపెరుగని కెరటము నీవు
ధైర్యానికి దర్పణము నీవు
ధ్యేయ సాధనలో ముందున్నావు
మాకై మనుగడ సాగించావు
నిద్రాహారాలను సైతం మరచావు
అహర్నిశలు మాకై శ్రేమించావు
మమ్మల్ని ఈ స్థాయికి చేర్చావు
కన్నీళ్లను కనుమాటున దాచావు
కంటిపాపలా మము కాచావు
కష్టాల కడలిని దాటావు
జయకేతనం ఎగరేశావు
ప్రతిక్షణం మాకై జీవించావు
మా భవితకు ఎంతో కృషి చేశావు
ప్రాణం కంటే మిన్నగా మము ప్రేమించావు
మా అందరి హృదయం లో కొలువున్నావు
నిరాడంబరతకు నిదర్శనము నీవు
త్యాగానికి మారుపేరు నీవు
మమతల మణిదీపము నీవు
ఉరికే జలపాతము నీవు
అలుపెరుగని కెరటము నీవు
ధైర్యానికి దర్పణము నీవు
ధ్యేయ సాధనలో ముందున్నావు
మాకై మనుగడ సాగించావు
నిద్రాహారాలను సైతం మరచావు
అహర్నిశలు మాకై శ్రేమించావు
మమ్మల్ని ఈ స్థాయికి చేర్చావు
కన్నీళ్లను కనుమాటున దాచావు
కంటిపాపలా మము కాచావు
కష్టాల కడలిని దాటావు
జయకేతనం ఎగరేశావు
ప్రతిక్షణం మాకై జీవించావు
మా భవితకు ఎంతో కృషి చేశావు
ప్రాణం కంటే మిన్నగా మము ప్రేమించావు
మా అందరి హృదయం లో కొలువున్నావు
కాలం
కాలం అమితవేగం
ఆగదు మనకోసం
సాగాలి పయనం
చేరేవరకు గమ్యం
చెయ్యాలి ప్రయత్నం
పొందేవరకు ఫలితం
పొంచివుంటుంది సోమరితనం
బానిసైతే మిగిలేది సూన్యం
కర్తవ్యాన్ని చెయ్యకు నిర్లక్ష్యం
తీరాలంటే నీ లక్ష్యం
మంచే మనకు ఆదర్శం
ఆ కీర్తే మనకు శాశ్వతం
ఆగదు మనకోసం
సాగాలి పయనం
చేరేవరకు గమ్యం
చెయ్యాలి ప్రయత్నం
పొందేవరకు ఫలితం
పొంచివుంటుంది సోమరితనం
బానిసైతే మిగిలేది సూన్యం
కర్తవ్యాన్ని చెయ్యకు నిర్లక్ష్యం
తీరాలంటే నీ లక్ష్యం
మంచే మనకు ఆదర్శం
ఆ కీర్తే మనకు శాశ్వతం
Wednesday, February 11, 2009
అమరజీవి
దేశ స్వాతంత్రానికి కారకులు ఎందరో మహానుభావులు
కానీ మన రాష్ట్ర స్వేచ్ఛకు కారకులు పొట్టి శ్రీరాములు
ప్రేత్యేక రాష్ట్రం కోసం చేపట్టాడు నిరాహారదీక్ష
అది యాబై రెండు రోజుల కఠోర పరీక్ష
ప్రాణాలు అర్పించి పరీక్ష నెగ్గాడు
ప్రేత్యేక రాష్ట్రాన్ని ఆవిర్భవింపజేశాడు
అంతులేని త్యాగంతో అమరజీవి అయినాడు
చిరస్మరనీయుడిగా చరిత్రకెక్కాడు
కృషిచేసిన వారినే కీర్తి వరించాలి
మన రాష్ట్రాన్ని అమర రాష్ట్రంగా మార్చాలి
కానీ మన రాష్ట్ర స్వేచ్ఛకు కారకులు పొట్టి శ్రీరాములు
ప్రేత్యేక రాష్ట్రం కోసం చేపట్టాడు నిరాహారదీక్ష
అది యాబై రెండు రోజుల కఠోర పరీక్ష
ప్రాణాలు అర్పించి పరీక్ష నెగ్గాడు
ప్రేత్యేక రాష్ట్రాన్ని ఆవిర్భవింపజేశాడు
అంతులేని త్యాగంతో అమరజీవి అయినాడు
చిరస్మరనీయుడిగా చరిత్రకెక్కాడు
కృషిచేసిన వారినే కీర్తి వరించాలి
మన రాష్ట్రాన్ని అమర రాష్ట్రంగా మార్చాలి
Tuesday, February 10, 2009
మానవజీవితం
ఏది ఎవరికి శాశ్వతం
ఎవరు ఎవరికి శాశ్వతం
అశాస్వతమైన ఈ జీవితంపై
ఎందుకింతటి వ్యామోహం
నాటి సోదరులు పంచుకున్నారు ప్రేమానురాగాలను
వారి వారసులు పంచుకుంటున్నారు ఆస్తిపాస్తులను
డబ్బే జీవితమని భావిస్తున్నారు
కన్న తల్లిని సైతం మరుస్తున్నారు
తన,మన మరచి తన వారిని విడచి
మనీ కోసం మరమనుషుల వలె జీవిస్తున్నారు
తమదే పైచేయిగా భావిస్తున్నారు
కన్నవారిని క్షోభకు గురిచేస్తున్నారు
పుట్టినపుడు మనతో తెచ్చింది లేదు
పోయేటపుడు మనతో తీసుకెల్లేది లేదు
ఈ నిజం అందరికి తెలియంది కాదు
అయినా డబ్బుపై ఎందుకింత మోజు
యాంత్రికమైన ఈ ప్రపంచంలో యంత్రాల్లా బ్రతుకుతున్నారు
ప్రొద్దున్నే వెళ్తారు ప్రొద్దెక్కాక ఇంటికి వస్తారు
తమ పిల్లలకు సైతం ప్రేమను పంచలేకున్నారు
వారిని మందలించి మంచి మర్గాన నడిపించలేకున్నారు
ఎవరు ఎవరికి శాశ్వతం
అశాస్వతమైన ఈ జీవితంపై
ఎందుకింతటి వ్యామోహం
నాటి సోదరులు పంచుకున్నారు ప్రేమానురాగాలను
వారి వారసులు పంచుకుంటున్నారు ఆస్తిపాస్తులను
డబ్బే జీవితమని భావిస్తున్నారు
కన్న తల్లిని సైతం మరుస్తున్నారు
తన,మన మరచి తన వారిని విడచి
మనీ కోసం మరమనుషుల వలె జీవిస్తున్నారు
తమదే పైచేయిగా భావిస్తున్నారు
కన్నవారిని క్షోభకు గురిచేస్తున్నారు
పుట్టినపుడు మనతో తెచ్చింది లేదు
పోయేటపుడు మనతో తీసుకెల్లేది లేదు
ఈ నిజం అందరికి తెలియంది కాదు
అయినా డబ్బుపై ఎందుకింత మోజు
యాంత్రికమైన ఈ ప్రపంచంలో యంత్రాల్లా బ్రతుకుతున్నారు
ప్రొద్దున్నే వెళ్తారు ప్రొద్దెక్కాక ఇంటికి వస్తారు
తమ పిల్లలకు సైతం ప్రేమను పంచలేకున్నారు
వారిని మందలించి మంచి మర్గాన నడిపించలేకున్నారు
సారధి
నీ కుటుంబానికి నీవు కావాలి రధసారధి
అధిగమించాలి అవరోధాల వారధి
మన మేదస్సే మరుగవని నిధి
కృషితో సాధించాలి అభివృద్ధి
సిరిసంపదలు చేరాలి నీ సన్నిధి
అధిగమించాలి అవరోధాల వారధి
మన మేదస్సే మరుగవని నిధి
కృషితో సాధించాలి అభివృద్ధి
సిరిసంపదలు చేరాలి నీ సన్నిధి
యువత
నేటి యువతే దేశ భవిత
యువత లేనిదే ప్రతిభ లేదు
ప్రతిభ లేనిదే ప్రగతి లేదు
ప్రగతి లేనిదే గెలుపు లేదు
గెలుపు లేని దేశం కానరాదు
యువత లేనిదే ప్రతిభ లేదు
ప్రతిభ లేనిదే ప్రగతి లేదు
ప్రగతి లేనిదే గెలుపు లేదు
గెలుపు లేని దేశం కానరాదు
మా మాష్టారు
ప్రతి ఉదయం చిరునవ్వుతో పలకరించారు
మా మనసులో ఆహ్లాదాన్ని నింపారు
అందరితో స్నేహంగా మెలిగారు
మాతో ఎంతో అనుబంధాన్ని పెంచుకున్నారు
సహనానికి మారుపేరు మీరు
అభినయంలో మీకు సాటి లేరు
ఎల్లప్పుడు మా మేలే కోరారు
ఎన్నో నీతి కథలను చెప్పారు
అలసట ఎరుగని కెరటం మీరు
వేడికి కరగని మేలిమి మీరు
మాకు కావాలి మీ ఆశీస్సులు
మమ్మల్ని గుర్తుంచుకుంటారు కదా ఎల్లప్పుడు
మా మనసులో ఆహ్లాదాన్ని నింపారు
అందరితో స్నేహంగా మెలిగారు
మాతో ఎంతో అనుబంధాన్ని పెంచుకున్నారు
సహనానికి మారుపేరు మీరు
అభినయంలో మీకు సాటి లేరు
ఎల్లప్పుడు మా మేలే కోరారు
ఎన్నో నీతి కథలను చెప్పారు
అలసట ఎరుగని కెరటం మీరు
వేడికి కరగని మేలిమి మీరు
మాకు కావాలి మీ ఆశీస్సులు
మమ్మల్ని గుర్తుంచుకుంటారు కదా ఎల్లప్పుడు
Saturday, February 7, 2009
ఆశయం
ప్రతి మనిషికీ ఉంది ఆశయం
తన గమ్యం చేరాలనే ఆవేశం
జీవితంలో ఒడిదుడుకులు సహజం
ఓ నేస్తమా చెందకు నిరుత్సాహం
ఏడాది బిడ్డ పరుగులు తీసేనా?
పునాది లేనిదే భవనాలు లేచేనా?
ఆటకు తుదిమొదలు ఒకచోట ఉండునా?
ప్రయత్నం లేనిదే ఫలితం అందేనా?
ఓటమిని చూసి కుంగిపోకు
గెలవలేదని ఆశని విడవకు
నీ లక్ష్యం ఎన్నడూ మరువకు
తప్పక చేరుతావు నీ ఒడ్డుకు
తన గమ్యం చేరాలనే ఆవేశం
జీవితంలో ఒడిదుడుకులు సహజం
ఓ నేస్తమా చెందకు నిరుత్సాహం
ఏడాది బిడ్డ పరుగులు తీసేనా?
పునాది లేనిదే భవనాలు లేచేనా?
ఆటకు తుదిమొదలు ఒకచోట ఉండునా?
ప్రయత్నం లేనిదే ఫలితం అందేనా?
ఓటమిని చూసి కుంగిపోకు
గెలవలేదని ఆశని విడవకు
నీ లక్ష్యం ఎన్నడూ మరువకు
తప్పక చేరుతావు నీ ఒడ్డుకు
Wednesday, January 7, 2009
సరస్వతి (సరు)
ఏదో తెలియని బాధ నాలోన లోలోన
ఇన్నాళ్ళ నా తోడు నీడ వదిలేనా నన్ను ఒంటరిగా
తన సహవాసం పెంచింది ధైర్యం నాలోన
చిన్న పెద్ద తేడా లేక మెలిగింది నాతో స్నేహంగా
అమ్మలా నాకు అండగా నిలిచింది
నాన్నల్లె నా చేయి పట్టి నడిపింది
గురువై నాకు పాఠాలు చెప్పింది
చెలిమై నాతో ఆటలు ఆడింది
పసిపాప వల్లే సుతిమెత్తని మనసామెది
ఆప్తుల కోసం కంటతడి పెడుతుంది
తన పేరుకు తగినట్టే చదువులతల్లి
తన సాయం కోరినవారికి కల్పవల్లి
ఇద్దరం ఒకచోట లేకున్నా
మన జ్ఞాపకాలను నా మదిలోన దాచుకున్న
ఇన్నాళ్ళ నా తోడు నీడ వదిలేనా నన్ను ఒంటరిగా
తన సహవాసం పెంచింది ధైర్యం నాలోన
చిన్న పెద్ద తేడా లేక మెలిగింది నాతో స్నేహంగా
అమ్మలా నాకు అండగా నిలిచింది
నాన్నల్లె నా చేయి పట్టి నడిపింది
గురువై నాకు పాఠాలు చెప్పింది
చెలిమై నాతో ఆటలు ఆడింది
పసిపాప వల్లే సుతిమెత్తని మనసామెది
ఆప్తుల కోసం కంటతడి పెడుతుంది
తన పేరుకు తగినట్టే చదువులతల్లి
తన సాయం కోరినవారికి కల్పవల్లి
ఇద్దరం ఒకచోట లేకున్నా
మన జ్ఞాపకాలను నా మదిలోన దాచుకున్న
Subscribe to:
Posts (Atom)
